Site icon Prime9

NBK Unstoppable-2: బాలయ్య నయా లుక్.. విజయవాడలో “అన్ స్టాపబుల్” గ్రాండ్ ఈవెంట్

unstoppable season 2 vijayawada event

unstoppable season 2 vijayawada event

NBK Unstoppable-2: బాలయ్య ఆ పేరే ఒక ఊపుతెప్పిస్తుంది. ఇంక థియేటర్లలో అయితే బాలయ్య వస్తే ఈలల మోత మోగుతుందనుకోండి. కేవలం థియేటర్లలోనే బాలయ్య హంగామా చేస్తాడు అనుకునేవారికి ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్ స్టాపబుల్ ఘన విజయాన్ని సాధించి మాటల్లేకుండా చేసింది. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమోకు విశేష స్పందన లభించింది.

అయితే అన్ స్టాపబుల్ రెండో సీజన్‌కు సంబంధించిన ట్రైలర్ ను 4వ తేదీన విజయవాడ నిర్వహించనున్న భారీ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ను దాదాపు 30 వేల మంది సమక్షంలో నిర్వహించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వేడుక కోసం ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం బాలకృష్ణ విజయవాడ వెళుతున్నారు. ఇకపోతే ఈవెంట్ పాస్‌ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారని వారి తాకిడిని తట్టుకోలేకపోతున్నట్లు నిర్వాహకులు అంటున్నారు. ఈ మొత్తం ఈవెంట్ ప్లాన్ కూడా పకడ్బందీగా డిజైన్ చేసినట్లు సమాచారం.

ఈవేదికపై ఇండియన్ ఐడల్ సింగర్స్ బాలయ్య పాటలతో హంగామా చెయ్యనున్నారు. మరియు బాలకృష్ణ పాటలతో మెడ్లీ, బాలకృష్ణ పాటల క్విజ్, సీజన్ వన్ హైలైట్స్ వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. ఇక దసరా సందర్భంగా బాలకృష్ణ, అల్లు అరవింద్ చేతుల మీదుగా రావణదహనం తదితర కార్యక్రమాలు ఈ ఈవెంట్ లో హైలెట్స్ ఉండనున్నాయి. అయితే అన్ స్టాపబుల్ సీజన్- 2 కి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా వ్యహరిస్తున్నారు.

ఇదీ చదవండి: “హంట్” తో హిట్ కొట్టనున్న సుధీర్ బాబు.. టీజర్ సూపర్

Exit mobile version
Skip to toolbar