Site icon Prime9

Transgenders: ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ట్రాన్స్ జెండర్లు

two-transgender-doctors-get-government-jobs-in-telangana

two-transgender-doctors-get-government-jobs-in-telangana

Transgenders: తెలంగాణలో ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ ఇద్దరు లింగ మార్పిడి చేయుకున్నవారు. వైద్య పట్టా పొందిన వారు ఇరువురూ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో విధులకు నియమితులయ్యారు. ప్రభుత్వరంగంలో వైద్యులుగా వీరి నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఎంతో ఉపయుక్తమని పలువురు భావిస్తున్నారు.

‘‘ఇది నిజంగా నాకు, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీకి గొప్ప రోజు. 2018లోనే వైద్య విద్య పూర్తయింది. 15 హాస్పిటల్స్ లో ఉద్యోగం కోసం తిరిగాను. కానీ నన్ను తిరస్కరించారు. అందుకు కారణం చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నాను’’ అని ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్ తెలిపారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆమె ఎంబీబీఎస్ చదివింది.

డాక్టర్ ప్రాచీ ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నుంచి తనను ఉద్యోగం నుంచి తీసివేసినట్టు ప్రాచీ చెప్పారు. తన గుర్తింపును చూసి రోగులు వచ్చేందుకు వెనుకాడతారని వారు చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ఇకపై కూడా ఎన్నో అవాంతరాలు రావచ్చు కానీ వాటన్నింటి మేము ఎదుర్కొవడానికి సిద్దమని ఆమె తెలిపారు. ‘‘మమ్మల్ని రోగులు వివక్షతో చూడొచ్చు. కానీ, ఒక్కసారి మేము వారికి చికిత్స అందించి, వారికి మెరుగైతే.. వారు ఇతరులను సైతం మా దగ్గరకు సిఫారసు చేస్తారు’’ అని డాక్టర్ రుత్ తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో నేటినుంచి మరింత కఠినంగా ట్రాఫిక్ రూల్స్

Exit mobile version