Site icon Prime9

Illegal Affair: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఇద్దరు సీఐలు..!

cis illegal affair

cis illegal affair

Illegal Affair: ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు సీఐలను సుబేదారి పోలీస్ స్టేషన్లో విచారించిన పోలీసులు, భర్త సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి వారే తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కవడంపై స్థానికంగా కలకలం సృష్టింస్తుంది. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

హనుమకొండ రాంనగర్‌కు చెందిన ఓ మహిళా సీఐ వరంగల్‌ సీఐడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. అయితే అక్కడే బలభద్ర రవి అనే మరో ఇన్‌స్పెక్టర్‌ పనిచేస్తున్నాడు. అయితే కొద్దిరోజులకు వీరి మధ్య మాటామాట కలిసి చనువు పెరిగింది. ఇద్దరూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లిరావడాలు చేస్తూ ఉండేవారు. దీనిని గమనిస్తూ వచ్చినపై మహిళా సీఐ భర్తకు ఓ అనుమానం వచ్చింది. ప్రస్తుతం మహిళా సీఐ భర్త కూడా మహబూబాబాద్‌ జిల్లాలో రూరల్‌ సీఐగా పని బాధ్యతలు నెరవేరుస్తున్నారు. వారిపై చాలా రోజుల నుంచి అనుమానం ఉన్నా దానిని ఏ విధంగా నిరూపించాలనే అని ఎదురుచుస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం మహిళా సీఐ ఇంటికి బలభద్ర రవి వచ్చాడు. వారిద్దరూ మాట్లాడుకుంటున్న క్రమంలో విషయం తెలుసుకున్న మహిళా సీఐ భర్త తన స్నేహితులతో కలిసి వచ్చి వారిని నిలదీశాడు. దానితో వారి మధ్య ఘర్షణ చెలరేగింది.

దానితో రవిని కట్టడి చేసి సుబేదారీ పోలీసులకు అప్పగించారు. మహిళా సీఐ భర్త ఫిర్యాదుపై సుబేదారీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు
రవి అనుమతి లేకుండా తన ఇంటికి వస్తున్నాడని, అడిగిన తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ మహిళా సీఐ భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ఆ ఇరువురి సీఐల మధ్య ఎలాంటి సంబంధం ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని సుబేదారీ సీఐ షుకుర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

Exit mobile version