TRS Leader Tammineni Krishnaiah Murder: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో టెన్షన్.. టెన్షన్..

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. తమ్మినేని కోటేశ్వర్‌రావు ఇంటిపై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్‌రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

  • Written By:
  • Publish Date - August 15, 2022 / 06:41 PM IST

Khammam: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ, తమ్మినేని కోటేశ్వర్‌రావు ఇంటి పై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్‌రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న క్వారీలో కోటేశ్వర్‌రావుకు సంబంధించిన జేసీబీని తగులబెట్టారు. తమ్మినేని కృష్ణయ్య మృతితో తెల్దారుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ్మినేని కృష్ణయ్య బైక్‌పై వెళ్తుండగా ఆయనను ఆటోలో వెంబడించి ఆయన స్కూటర్‌ను ఢీ కొట్టారు. కృష్ణయ్య కిందపడ్డాక వేట కొడవళ్లతో హత్య చేశారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృష్ణయ్య ప్రధాన అనుచరుడు. ఆంధ్రాబ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్‌గా కృష్ణయ్య ఉన్నారు.