Site icon Prime9

Varisu : సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా దళపతి విజయ్ “వరిసు”… ఎందుకంటే?

thalapathy vijay varisu movie trending on social media

thalapathy vijay varisu movie trending on social media

Varisu : తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి ”విజయ్” కి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి ఫుల్ గా అభిమానులు ఉన్నారు. స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా విజయ్ మరింత చేరువయ్యాడు అని చెప్పాలి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ”వరిసు” అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో వారుసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమిళంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇందులో ఖుష్బూ, వెటరన్ హీరోయిన్ జయసుధ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే తెలుగులో, తమిళంలో వివాదాలు రేగాయి. తెలుగులో సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” , నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి” సినిమాలు వస్తుండగా తమిళ సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించడం పట్ల నిర్మాతలు, అభిమానులు దిల్ రాజుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇక తమిళంలో అజిత్ కంటే విజయ్ పెద్ద హారో అని దిల్ రాజు వ్యాఖ్యానించడం పెద్ద రగడకు దారి తీసింది. ఇవన్నీ దాటుకొని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఈరోజు 5 గంటలకు తమిళ,  7 గంటలకు తెలుగు ట్రైలర్ లను రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు విజయ్ ఫాన్స్ అంత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ లో #VarisuTrailer, #2HoursToGoforVarisuTrailer హ్యాష్ టాగ్స్ ట్రెండింగ్ గా మారాయి.

YouTube video player

 

Exit mobile version
Skip to toolbar