Site icon Prime9

Telugu Movies: వేసవి వినోదాల విందు.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ విడుదలయ్యే చిత్రాలివే!

movies

movies

Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి. మరి ఈ వారంలో థియేటర్/ ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటో చూద్దాం.

థియేటర్ చిత్రాలు.. (Telugu Movies)

వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.

ఇక ఈ వారంలో పలు ఆసక్తికర చిత్రాలు భాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ఈ వారంలో థియేటర్/ ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటో చూద్దాం.

నాగచైతన్య ‘కస్టడీ’

ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది అంటున్నారు నాగచైతన్య. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం కస్టడీ.

వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. కృతి శెట్టి కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించారు.

శరత్‌ కుమార్‌, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

‘ఛత్రపతి’గా వస్తున్న సాయి శ్రీనివాస్‌

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఛత్రపతి సినిమాను రిమేక్ చేసిన విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీ వెర్షన్ లో ఈ సినిమాలో నటించారు.

వి.వి వినాయక్‌ దర్శకుడు. నుస్రత్‌ భరుచా కథానాయిక. తెలుగులో విజయవంతమైన ప్రభాస్‌-రాజమౌళిల ‘ఛత్రపతి’ని అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు.

మే 12న ఈ సినిమా విడుదల కానుంది.

భువన విజయమ్‌ కథేంటి?

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

మే 12 ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రైమ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో..

‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ నాయకనాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా మే 12న థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.

ప్రేమ నుంచి పెళ్లిదాకా..

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’. ఒ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. బోయపాటి రఘుబాబు నిర్మాత.

మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం..పెళ్లి వరకూ ఎలా సాగిందనేది తెరపైనే చూడాలన్నాయి సినీవర్గాలు.

‘మ్యూజిక్‌ స్కూల్‌’లో ఏం జరిగింది?

 

యామిని ఫిలింస్‌ పతాకంపై పాపారావు బియ్యాల నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’.

శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌

నవదీప్‌ చూపించనున్న ‘న్యూసెన్స్‌’ ఏంటి?

నవదీప్‌, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

నెట్‌ఫ్లిక్స్‌

రాయల్‌ టీన్‌: ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్) మే 11
ఎరినీ (హాలీవుడ్‌)మే 11
ది మదర్‌ (హాలీవుడ్‌) మే 12
క్రాటర్‌ (హాలీవుడ్) మే 12
బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) మే 12
అమెజాన్‌ ప్రైమ్‌

ఎయిర్‌ (హాలీవుడ్) మే 12
జీ5

తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ (హిందీ సిరీస్‌-2) మే 12

డిస్నీ+హాట్‌స్టార్‌

ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌సిరీస్‌) మే 10
స్వప్న సుందరి (తమిళ/తెలుగు) మే 12

సోనీ లివ్‌

ట్రాయాంగిల్‌ ఆఫ్ శాడ్‌నెస్‌ (హాలీవుడ్) మే 12
బుక్‌ మై షో

ఎస్సాసిన్‌ క్లబ్‌(హాలీవుడ్‌)మే 10
జియో సినిమా

విక్రమ్‌ వేద (హిందీ) మే12

Exit mobile version