Site icon Prime9

KCR:ప్రాణనష్టం లేకుండా చూడాలి.. మూడురోజులపాటు విద్యాసంస్దలకు సెలవు.. కేసీఆర్

Telangana: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో  ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ సంబంధిత చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పోలీస్, వైద్య, విద్యాశాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించి, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్‌లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం కేసీఆర్  విజ్ఞప్తి చేశారు.

Exit mobile version
Skip to toolbar