Site icon Prime9

Varupula Raja : తెలుగుదేశం పార్టీలో విషాదం.. ప్రత్తిపాడు ఇంచార్జ్ వరపుల రాజా మృతి

tdp leader varapula raja passed away due to heart attack

tdp leader varapula raja passed away due to heart attack

Varupula Raja : తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడ లోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అపోలోకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో రాజా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దతుగా మూడు రోజులుగా బొబ్బిలి, సాలూరు నియోజకవర్గంలో రాజా పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్తిపాడు వచ్చారు. రాత్రి 9 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడ లోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోకి వెళ్లిన తర్వాత పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన రాత్రి 10 గంటలకు అపోలో ఆసుపత్రికి రాజాను తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన రాజా స్వయంగా కారు దిగి గుండెపై చేయి వేసుకుని నొప్పితో ఆసుపత్రిలోకి వెళ్లారు. వెంటనే కుప్పకూలిపోయారు. సీపీఆర్‌ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వరుపుల రాజాకు ఐదేళ్ల కిందట ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పట్లో వైద్యులు రాజా గుండెకు స్టంట్‌ అమర్చారు.

వరపుల రాజా భార్య సత్యప్రభ. ఆయన కుమార్తె సత్య మాధురి, కుమారుడు సాయి తర్షిత్‌ ఉన్నారు. రాజా స్వస్థలం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామం. కాగా ఆయన డిగ్రీ పూర్తి చేశారు. ఈరోజు రాజా అంత్యక్రియలు జరగనున్నాయని సన్నిహితులు తెలిపారు. వరపుల రాజా తాత జోగిరాజు, చిన తాత సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యేలుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుపుల రాజా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా, ఎంపీపీగా, టీడీపీ ప్రభుత్వంలో ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. 2019లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

పార్టీకి తీరని లోటు.. చంద్రబాబు

కాగా.. వరుపుల రాజా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబుపేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. రాజా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకానున్నట్లు పేర్కొంటున్నారు.

పార్టీ యువ నేతను కోల్పోయింది.. నారా లోకేష్

ఆత్మీయ స్నేహితుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయింది. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను‌. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టిడిపికి తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version