Taraka Ratna Health: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఆయనకు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేశారు. ఇందులో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తారకరత్న కుటుంబ సభ్యులు.. బెంగళూరుకు చేరుకుంటున్నారు.
మరింత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. (Taraka Ratna Health)
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు.. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. గత 22 రోజులుగా.. తారకరత్న చికిత్స పొందుతున్నారు. కోమాలో ఉన్న తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తారకరత్న పరిస్థితి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈరోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు 22 రోజులుగా చికిత్స అందిస్తూ.. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. బ్రెయిన్ స్పందించకపోవడంతో 22 రోజుల నుంచి కోమాలోనే ఉన్నారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుసుకున్న బాలకృష్ణ హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తారకరత్న కోలుకొని అభిమానులు కోరుకుంటున్నారు.
పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న..
కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కొద్ది దూరం నడిచాక ఆయన అకస్మాత్తుగా పడిపోయారు. యువగళం సైనికులు వెంటనే కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్యకళాశాలకు తరలించిన చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు. కుప్పం నియోజకవర్గంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి యువగళం యాత్ర ప్రారంభమైంది.