Site icon Prime9

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్‌ షోలో ఆ సంఘటన గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న సూర్య

Suriya in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో స్పెషల్‌ ఎసిసోడ్‌ బాలయ్య తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సందడి చేశారు. ఇక లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో తమిళ స్టార్‌ హీరో సూర్య అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొన్నాడు. తన తాజాగా చిత్రం కంగువ రిలీజ్‌ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది.

ఇందులో బాలయ్య కార్తితో తన ప్రశ్నలతో ఆటపట్టించారు. అంతేకాదు తన తమ్ముడు కార్తితో కలిసి సూర్యని ఆటాడుకున్న తీరు బాగా ఆకట్టుకుంటుంది. ఇక సూర్య బాలయ్య ప్లైయింగ్‌ కిస్‌ ఇస్తూ ఐ లవ్‌ యూ చెప్పడం ప్రొమోలో హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ షో సూర్య కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. అలా బాలయ్య అడిగిన ప్రశ్నలకు సూర్య ఫన్నీగా సమాధాలు ఇచ్చి ఆకట్టుకన్నారు. ఇలా ప్రొమో అంతా సందడిగా సాగింది.

నేను సింహమైతే.. అతడు సింగం. నేను లెజెండ్‌ అయితే.. అతను గజిని. నేను అఖండ అయితే అతడు రోలెక్స్‌ అంటూ బాలయ్య సూర్య ఇంట్రోతో అదరగోట్టాడు. సూర్య రాగానే.. హృదయం ఎక్కడుంది అంటూ బాలయ్య పాట పాడగా.. సూర్య స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత సూర్యని బాలయ్య తన ప్రశ్నలతో టీజ్‌ చేశాడు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ మొదటి ప్రశ్నతోనే సూర్యని చిక్కుల్లో పడేశాడు బాలయ్య. కార్తి తన ఫోన్లో నీ పేరు ఏమని సేవ్‌ చేసుకున్నాడని అడగ్గానే.. ఫస్ట్‌ క్వశ్చ్యనే అవుట్‌ ఆఫ్‌ సెలబస్‌ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఫస్ట్‌ క్రష్‌ ఎవరని అడగ్గా అది చెప్పడానికి సూర్య ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత కార్తితో ఫోన్‌ మాట్లాడుతూ.. మీ అన్నయ్య ఇప్పటివరకు అన్ని అబద్ధాలు చెప్పాడు.. అనగానే చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అంతే సార్‌ అని కార్తి ఫన్నీ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత నీ సీక్రెట్స్‌ ఎవరితో షేర్‌ చేసుకుంటావు? కార్తితోనా? జ్యోతికతోనా? అనగానే స్పాట్‌లో పెట్టారు సర్‌ అంటూ సూర్య చెప్పాడు. ఆ తర్వాత జ్యోతిక లేకుండ తన లైఫ్‌ని ఊహించుకోలేనని, ఐ లవ్‌ యూ అంటూ భార్యపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఆ తర్వాత సూర్య ఓ సంఘటనని గుర్తు చేసుకుని షోలో కన్నీరు పెట్టుకోవడంతో షోలో ఉన్న ఆడియన్స్‌ సైతం ఎమోషనల్‌ అయ్యారు. ఇలా సరదాగా, ఎమోషనల్‌ రైడ్‌గా, ఫన్నీగా ప్రోమో ఆసక్తిగా సాగింది.

Exit mobile version