Laxmi Parvathi: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన కేసులో ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరంటూ కేసును ధర్మాసనం కొట్టేసింది. ఎవరి ఆస్తుల వివరాలు, ఎవరు తెలుసుకోవాలంటూ ప్రశ్నిస్తూ….కేసులో లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశానికి విలువలేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. మరిన్ని వివరాలు కోర్టు వ్యవహరం పూర్తి అయిన తర్వాత తెలియనున్నాయ్. తొలినుండి సుప్రీం కోర్టులో ఈ కేసు నిలవదంటూ తెదేపా వర్గీయులు చేసిన క్రమంలో కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
Supreme Court: సుప్రీం కోర్టులో లక్ష్మీ పార్వతికి చుక్కెదురు

Supreme Court