Site icon Prime9

Animal : యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ కి రానున్న సూపర్ స్టార్ మహేష్ ,రాజమౌళి ..

super star mahesh babu and director rajamouli attends animal pre release event

super star mahesh babu and director rajamouli attends animal pre release event

Animal: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన లేటేస్ట్ చిత్రం ‘యానిమల్’. హిందీలో కబీర్ సింగ్ తర్వాత ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు.రణబీర్ కపూర్ ఒక మాస్ అవతారం లో ఎప్పుడు చూడని విధం గా కొత్త లుక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.. ఇక ఇటీవలే ట్రైలర్ తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా మార్చేశాడు డైరెక్టర్ సందీప్. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ఎమోషన్ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ విడుదల కాబోతుండడంతో సౌత్ టూ నార్త్ అన్ని ప్రాంతాల్లో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తెలుగు అడియన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఈరోజు సాయంత్రం మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జక్కన్న గతంలో రణబీర్, అలియా, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రణబీర్ కపూర్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి రణబీర్ సినిమా కోసం ముందుకు వస్తున్నారు జక్కన్న. అటు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ వేడుకకు రాబోతున్నారు. వీరిద్దరు కలిసి ఒకే వేదికపై సందడి చేయబోతుండడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వేడుకలో బయటకు రావడం ఖాయమంటున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేష్.. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత వచ్చే ఏడాది వేసవిలో జక్కన్న, మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈప్రాజెక్ట్ అప్డేట్స్ రాజమౌళి బయటపెట్టడం ఖాయమని భావిస్తున్నారు ఫ్యాన్స్. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథవీరాజ్, శక్తికపూర్ కీలకపాత్రలు పోషించారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కి ఈ ఈవెంట్ లో తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వస్తాయేమో చూడాలి .

Exit mobile version