Site icon Prime9

Pushpa 2: ‘పుష్ప 2’ ట్రైలర్‌పై ప్రశంసల వెల్లువ – డైరెక్టర్‌ రాజమౌళి ఏమన్నారంటే..!

Rajamouli Review on Pushpa 2 Trailer: ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 మ్యానియానే కనిపిస్తోంది. ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పుటి నుంచి అంతా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో డైలాగ్స్‌తో సోషల్‌ మీడియా మారుమోగుతుంది. ట్రైలర్‌ మొత్తం వైల్డ్‌ఫైర్‌గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఎంతోకాలంగా పుష్ప 2 ట్రైలర్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకి సుకుమార్‌ ట్రీట్‌ ఫీస్ట్‌ ఇచ్చాడంటున్నారు. చెప్పాలంటే ట్రైలర్‌ మొత్తం తగ్గేదే లే అన్నట్టు అద్యాంతం ఆకట్టుకుంది.

పాట్నా వేదికగా భారీ ఏర్పాట్ల మధ్య విడుదలైన ఈ ట్రైలర్‌ విశేష స్పందన వస్తోంది. 24 గంటలు గడవకముందే రికార్డు వ్యూస్‌తో యూట్యుబ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ట్రైలర్‌ చూసిన వాళ్లు బన్నీ పర్ఫామెన్స్‌, సుకుమార్‌ క్రియేటివిటీని పొగడకుండ ఉండలేకపోతున్నారు. దీంతో తెలుగు స్టార్‌ డైరెక్టర్స్‌ ఒక్కొక్కరిగా ట్రైలర్‌పై రివ్యూస్‌ ఇస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి పుష్ప 2 ట్రైలర్‌పై తన రివ్యూ ఇచ్చారు.

‘పాట్నాలో మొదలైన వైల్డ్‌ఫైర్‌ దేశవ్యాప్తంగా పాకుతూ డిసెంబర్‌ 5న పేలబోతోంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నా పుష్ప!!!’ ట్వీట్‌ చేశారు. ఇక ఆయన కామెంట్‌కి అల్లు అర్జున్‌ స్పందించారు. సార్‌.. థ్యాంక్యూ వెరీ మచ్‌. మీకు గోప్ప పార్టీ ఇవ్వాలని ఆశిస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే అనిల్‌ రావిపూడి, డైరెక్టర్‌ బాబీ, హరీష్‌ శంకర్‌, ప్రశాంత్‌ వర్మ, రిషబ్‌ శెట్టి వారు సైతం ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ చేస్తూ.. “తిరుగుబాటును విప్లంగా మార్చిన వ్యక్తి తిరిగి వచ్చాడు. మునుపటి కంటే మరింత బిగ్గరగా, ఉగ్రంగా, ఘోరంగా ఉన్నాడు. ఈ పవర్‌హౌజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిసెంబర్‌ 5 కోసం ఎదురుచూ్సతున్నా” అని రాసుకొచ్చాడు.

అలాడే డైరెక్టర్‌ బాబీ.. పుష్ప 2 ట్రైలర్‌ ఓ బ్లాక్‌బస్టర్‌. అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారు అర్థమైపోతుంది. సుకుమార్‌ సర్‌ మార్క్‌ ప్రతి ఫ్రేంలోనూ కనబడుతోంది. పుష్ప టీం శుభకాంక్షలు” అని పేర్కొన్నాడు.

కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ భరద్వాజ్, సునీల్‌, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నవీన్‌ యర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Exit mobile version