Site icon Prime9

Chiranjeevi: శ్రీకాంత్‌ ఓదెల-చిరంజీవి మూవీ – మరో ఇంద్ర కానుందా?

Srikanth Odela About Chiranjeevi Movie: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇంకా సెట్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టారు. దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెలతో ఓ యాక్షన్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనిపై నిన్న అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఆస్తికర పోస్టర్‌ రిలీజ్ చేశాడు నాని. ప్రస్తుతం ప్రీ లుక్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో చిరు చేయి మొత్తం రక్తంతో తడిసి ఉంది. పైగా చేయికి బ్రెస్‌లెట్స్‌ కూడా ఉన్నాయి.

చేతి నుంచి చుక్కలు చుక్కలుగా రక్తం కారుతున్నట్టు చూపించారు. ఈ సినిమాలో వయెలెన్స్‌లో ఎక్కువ ఉండనుందని పోస్టర్‌తో హింట్‌ ఇచ్చేశారు. పైగా దీనికి హింసలో అహింసను వెతుకున్నాడు అంటూ క్రేజీ క్యాప్షన్‌ జోడించారు. ఇక ఇదే పోస్టర్‌ను బుధవారం శ్రీకాంత్‌ ఓదేల షేర్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌ కోసం చిరు చేతిని ఇంద్ర మూవీ నుంచి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి ఇది చిరంజీవి గారి చేయే కానీ, దానికి ఉన్న బ్రెస్‌లెట్స్‌ మావీ అంటూ సరదా కామెంట్స్‌ చేశారు. దీనికి ఇంద్ర రేంజ్‌లో తీస్తున్నారని, ఈ సినిమా మరోక ఇంద్ర కానుందని చెప్పి హైప్‌ పెంచారు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి.

హై బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. కాగా, ఈ ప్రాజెక్టులో చిరంజీవిని సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడట శ్రీకాంత్‌ ఓదెల. కాగా శ్రీకాంత్‌ ఓదెల యంగ్ డైరెక్టర్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన చేసింది ఒక్క సినిమానే. ప్రస్తుతం నానితో ఓ చిత్రం చేస్తున్నాడు. దసరాతో ఎంట్రీ ఇచ్చిన అతడు మొదటి ప్రయత్నంలోనే సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.

దసరా బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. తొలి సినిమా సైమా అవార్ట్స్‌తో పాటు మరిన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకున్నాడు. ఈ చిత్రం వందకోట్ల క్షబ్‌లో చేరి రికార్డు క్రియేట్‌ చేసింది. తెలంగాణలోని కోల్‌ మైన్స్‌ సింగరేణి బ్యాక్‌డ్రాప్‌తో తీసిన దసరా మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక శ్రీకాంత్‌ ఓదెల చిరు డై హర్డ్‌ ఫ్యాన్‌ అనే విషయం తెలిసిందే. ఎప్పటికైన ఆయనతో సినిమా చేస్తాననిచెప్పాడు. కానీ అతడి కల ఇంత త్వరగా నెరవేరుతుందని ఎవరూ ఊహించలేదు. శ్రీకాంత్‌ ఓదెలపై పూర్తి నమ్మకం ఉంచి అతడి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం.

Exit mobile version