Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై వేటు

Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది.

డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేయనున్నారు.

అదే విధంగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు నిఘా వర్గాలు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నాయి.

మీ ఇంటి ముందు ఉన్నానంటూ ట్వీట్

జూబ్లీహిల్స్ లో ప్లజెంట్ వ్యాలీ అనే గ్రేటెట్ కమ్యూనిటీలో స్మితా సబర్వాల్ నివాసం ఉంటున్నారు. ఇదే కమ్యూనిటీలో పోలీసు ఉన్నాధికారులతో పాటు పలువురు వీఐపీ ఉంటున్నారు.

అయితే, రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి కారులో ఆమె ఉండే ఇంటి దగ్గరకు వెళ్లాడు.

ఆ టైంలో తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని కొత్త బాబుని వెంట తీసుకెళ్లాడు.

తాను బీ17 క్వార్టర్కు వెళ్లాలని ఎంట్రీలోని సెక్యూరిటీ సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.

స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం స్మితా సబర్వాల్ ఉంటున్న బీ 11 కు వెళ్లాడు.

ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి డోర్ కొట్టగా.. డోర్ తెరిచిన స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు అంత రాత్రి ఎదురుగా గుర్తు తెలియని కనిపించడంతో నివ్వెరపోయారు.

తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించారు. వెంటనే 100 కి సమాచారం ఇచ్చారు.

ఈ లోపల సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. కాసేపటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి ఆనంద్ కుమార్ తో పాటు తన ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్నారు.

వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

కాగా, నిందితుడు ఆనంద్ .. స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లే ముందు ‘ మీ ఇంటి ముందు ఉన్నాను’ అని ఆమె ట్వీట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/