Sharwanand Engagement: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. అందరూ అనుకున్నట్టుగానే వెడ్డింగ్ అప్‌డేట్ ఇచ్చేశాడు. త్వరలోనే ఆయన పెళ్లిపీటలు ఎక్కనున్నారు.
శర్వానంద్ కు రక్షితా రెడ్డితో గురువారం ఘనంగా నిశ్చితార్ధం జరిగింది.
ఇరు కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో హైదరాబాద్ లోని ఓ హెటల్ లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి శర్వానంద్ కు దగ్గరి ఫ్రెండ్ అయిన మెగాహీరో రాంచరణ్, ఉపాసన దంపతులు పాల్గొన్నారు.
కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు విషెస్ చెప్తూ అభిమానులు ఫొటోలను షేర్ చేస్తున్నారు.
శర్వానంద్ , రక్షితా రెడ్డి ల వివాహం ఏప్రిల్ లో జరగనున్నట్టు సమాచారం. అయితే శర్వానంద్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో అనే దానిపై పలువురు నెట్టింట్లో వెతుకులాట మొదలుపెట్టారు.
ఎవరీ రక్షితా రెడ్డి?
శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి. ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.
టీడీపీ మాజీ మంత్ర బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి రక్షితా రెడ్డి మనువమరాలు అవుతుంది. రక్షితా రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుందని సమాచారం.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా శర్వానంద్ కు రక్షితా రెడ్డి పరిచయం అయినట్టు తెలుస్తోంది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇరువైపుల పెద్దవాళ్ల అంగీ కారంతో గురువారం నిశ్చాత్తారం ఘనంగా జరిగింది.
శర్వానంద్ తాజాగా ‘కొత్త జీవితం’అనే మూవీలో నటించాడు. రీతూ వర్మ హీరోయిన్ గా శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించాడు.
తర్వాత శర్వానంద్ కొత్త ప్రాజెక్టుల సంబంధిన అప్ డేట్ లేదు. పెళ్లి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటమే దానికి కారణంగా తెలస్తోంది.
త్వరలోనే తన కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తారని సమాచారం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/