Site icon Prime9

Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ చంపేస్తామంటూ బెదిరింపులు – వ్యక్తి అరెస్ట్‌, విచారణంలో షాకింగ్‌ విషయాలు వెల్లడి!

Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్‌, మెయిల్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ఈ క్రమంలో తాజాగా మారోసారి స్టార్‌ హీరోకి బెదిరింపులు రావడం బి-టౌన్‌లో కలకలం రేపుతుంది. ఈసారి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. తాము అడిగినట్టు రూ. 50లక్షలు ఇవ్వాలని లేదంటే షారుక్‌ ఖాన్‌కి హాని తలపెడతామంటూ ముంబై పోలీసులకు ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ కాల్‌ ఫైజాన్‌ ఖాన్‌ ఫోన్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు.

చత్తీస్‌గడ్‌ నుంచి ఈ కాల్‌ వచ్చినట్టు పోలీసులు ట్రేస్‌ చేశారు. దీంతో బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైజాన్‌ ఖాన్‌ని అరెస్ట్‌ చేసి విచారించారు. ఈ ఇంట్రాగేషన్‌లో అతడు తన ఫోన్‌ పోయినట్టు పోలీసులకు తెలిపాడం కోసమెరుపు. నవంబర్‌ 2న తన ఫోన్‌ పోయినట్టు నిందితుడు విచారణలో చెప్పాడు. కాగా గతంలో షారుక్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్‌ రాగా.. ఆయనకు వై ప్లస్‌ కేటగిరి భద్రతను పెంచారు.

Exit mobile version