Site icon Prime9

Sajjala Ramakrishna Reddy : పోరాడితే పోయేదేం లేదనడానికి ఇదేమీ యూనియన్ కాదు.. రాజకీయ పార్టీ : సజ్జల రామకృష్ణా రెడ్డి

sajjala ramakrishna reddy About early elections in Ap

sajjala ramakrishna reddy About early elections in Ap

Sajjala Ramakrishna Reddy : విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. జగనే మళ్లీ రావాలి, తమకు జగనే కావాలని ప్రజలు కోరుకుంటుడడంతో విపక్షాలు భరించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా? మా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వయబిలిటీ గురించే ఆలోచిస్తోంది అని సజ్జల పేర్కొన్నారు.

వాళ్ళు కూడా అడిగితే బాగుంటుంది – సజ్జల (Sajjala Ramakrishna Reddy)

అదే విధంగా స్టీల్ ప్లాంట్ టెండర్ లో చాలా పరిమితులు ఉన్నాయని.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని, ప్రధాని మోదీతోనూ చాలాసార్లు మాట్లాడారని సజ్జల వివరించారు. జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ కూడా చెప్పారని వెల్లడించారు. పోరాడితే పోయేదేం లేదనడానికి ఇదేమీ యూనియన్ కాదని, రాజకీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. సమర్థంగా వాదించి కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్లు కూడా ఈ దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ కూడా కేంద్రాన్ని అడిగితే మంచిదే.. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో అడిగితే బాగుంటుంది.. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని ఎంతమంది అడిగితే అంత మంచిది అని సజ్జల వివరించారు.

ఇక స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఏమని ప్రతిపాదన చేసిందో తనకు తెలియదని, వర్కింగ్ క్యాపిటల్ అంశంలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చని అన్నారు. వాళ్లు స్టీల్ బిజినెస్ లో లేరని, ఒకవేళ కొత్తగా స్టీల్ బిజినెస్ స్థాపించి ఇక్కడ్నించి తీసుకెళ్లి మార్కెటింగ్ చేస్తారేమో అని సజ్జల అభిప్రాయపడ్డారు. సింగరేణి సంస్థ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటారేమో తనకు తెలియదని అన్నారు.

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ..

విశాఖ స్టీల్  ప్లాంట్  బిడ్డింగ్ లో పాల్గొనే ముందు  ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? అనుకూలమా అనే విషయాన్ని కేసీఆర్ సర్కార్ , బీఆర్ఎస్   స్పష్టం చేయాలని  డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు  తాము వ్యతిరేకమని  కేసీఆర్  చేసిన  ప్రకటనను  మంత్రి అమర్ నాథ్  గుర్తు చేశారు. ప్రైవేటీకరణను  వ్యతిరేకించిన  బీఆర్ఎస్ బిడ్డింగ్ లో  ఎలా  పాల్గొంటుందని  ఆయన  ప్రశ్నించారు.  బిడ్డింగ్ లో  పాల్గొంటే  ప్రైవేటీకరణను  సమర్ధించినట్టేనని  మంత్రి అమర్ నాథ్  చెప్పారు. విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను  వ్యతిరేకిస్తే  ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా  తమతో కలిసి రావాలని  ఆయన  డిమాండ్  చేశారు.  విశాఖ స్టీల్  ప్లాంట్  పేరుతో  రాజకీయాలు  చేయవద్దని  మంత్రి అమర్ నాథ్  బీఆర్ఎస్  నేతలను  కోరారు. విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి  తమ మద్దతు ఉందని మంత్రి  అమర్ నాథ్  గుర్తు  చేశారు.

Exit mobile version