RR vs DC: దిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో గెలుపొందింది.
దిల్లితో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నిలకడగా ఆడుతున్న వార్నర్ ఔటయ్యాడు. 49 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ అర్దసెంచరీ సాధించాడు.
దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. చాహాల్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ స్టంపౌట్ అయ్యాడు. 111 పరుగుల వద్ద దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది.
దిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 బంతుల్లో లలిత్ 38 పరుగులు చేశాడు. క్రీజులోకి అక్షర్ పటెల్ వచ్చాడు.
11 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో లలిత్, వార్నర్ ఉన్నారు.
ఐపీఎల్ లో డెవిడ్ వార్నర్ 6వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడానికి దిల్లీ బ్యాటర్లు కష్టపడుతున్నారు. ప్రస్తుతం 8 ఓవర్లకు దిల్లీ 48 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్, లలిత్ ఉన్నారు.
దిల్లీ ముడో వికెట్ కోల్పోయింది. రూస్సోవ్ అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు 36 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ కష్టాల్లో పడింది. 15 పరుగలకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా, మనీష్ పాండే ఇద్దరు డకౌట్ గా వెనుదిరిగాడు.
రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. జైస్వాల్, బట్లర్ రాణించగా.. చివర్లో హెట్ మేయర్ విశ్వరూపం చూపించాడు. జైస్వాల్ 60 పరుగులు చేయగా.. బట్లర్ 79 పరుగులు చేశాడు. చివర్లో హెట్ మేయర్ నాలుగు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో రాయల్స్ భారీ స్కోర్ సాధించింది.
దిల్లీ జట్టులో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, పావెల్ చెరో వికెట్ తీసుకున్నారు.
18 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి రాయల్స్ 168 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్, హెట్ మేయర్ ఉన్నారు.
15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి రాయల్స్ 130 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్, హెట్ మేయర్ ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. పావెల్ బౌలింగ్ లో రియాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరాగ్ 11 బంతుల్లో 7 పరుగులు చేశాడు.
జోస్ బట్లర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ 112 పరుగులు చేసింది.
పది ఓవర్లకు రాజస్థాన్ 103 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ శాంసన్ డకౌయ్ అయ్యాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్ లో నోర్జియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 103 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.
రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. యశస్వి 31 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దీంతో 98 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.
రాజస్థాన్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరు పోటీ పడి పరుగులు చేస్తున్నారు. దీంతో 8 ఓవర్లకు 96 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి.
ఏడు ఓవర్లకు రాయల్స్ 79 పరుగులు చేసింది. అక్షర్ వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
పవర్ ప్లే ముగిసేసరికి రాయల్స్ 68 పరుగులు చేసింది. ఇందులో జైస్వాన్ 41 పరుగులు చేయగా.. బట్లర్ 24 పరుగులు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు బౌండరీల వరద పారిస్తున్నారు. కేవలం 5 ఓవర్లలో 63 పరుగులు చేశారు.
నాలుగు ఓవర్లకే రాయల్స్ 50 పరుగులు చేసింది. ఖలీల్ వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
మూడు ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ 39 పరుగులు చేసింది. ఓపెనర్లు పోటిపడి మరి పరుగులు సాధిస్తున్నారు. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
రెండో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు రాయల్స్ 32 పరుగులు చేసింది.
ఖలీక్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ల యశస్వి జైస్వాల్ 5 ఫోర్లు కొట్టాడు. క్రీజులో జోస్ బట్లర్, జైస్వాల్ ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ , అన్రిచ్ నార్ట్ జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్