Site icon Prime9

RGV vs VH Issue : ఓ తాతగారూ మీరింకా వున్నారా??? అంటూ వీహెచ్ కి కౌంటర్ ఇచ్చిన – రామ్‌గోపాల్‌ వర్మ

RGV vs VH Issue trending on telugu states

RGV vs VH Issue trending on telugu states

RGV vs VH Issue : దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్‌ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు. సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదని.. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుందని చెప్పారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయండని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేసి, వర్మ మీద చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు.

తాజాగా వీహెచ్ కామెంట్స్‌పై స్పందించిన ఆర్జీవీ.. ‘‘ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి’’ అంటూ ట్వీట్ చేశారు.

 

దీంతో వీహెచ్‌ మరోసారి వర్మపై విరుచుకుపడ్డారు. రాంగోపాల్ వర్మ తెలివి ఏంటో అర్థమవుతోంది అంటూ ఎద్దేవ చేశారు. తాడ ఉందొ లేదో అనేది సమస్య కాదని, ముందు నువ్వు మాట్లాడిన మాటలు గురించి చెప్పంటూ ప్రశ్నించారు. మహిళలు మీద గౌరవం లేదా అన్నారు. వర్మ మహిళలోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏ కేసులు ఉంటే ఆకేసులు వర్మ పై పెట్టాలని, వర్మ తో పాటు వైస్ ఛాన్సలర్ పై కూడా కేసు నమోదు చేయాలన్నారు. సినిమా లోకం కూడా దీనిపై స్పందించాలన్నారు.

అంతకు ముందు ఆర్జీవీ కామెంట్స్‌పై వీహెచ్ మాట్లాడుతూ (RGV vs VH Issue)..

నాగార్జున యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ మహిళలను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు ఆయన వ్యాఖ్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రంభ, ఊర్వశిలు స్వర్గంలో లేరని చెబుతూ జీవితాన్ని ఆస్వాదించమని రాంగోపాల్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారని వీహెచ్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వర్మ మహిళలను అవమానించారని, కించపరిచారని మండిపడ్డారు.. ‘‘వర్మకు ప్రొఫెసర్‌ కంటే ఎక్కువ జ్ఞానం ఉందని నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రాజశేఖర్‌ అన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా వైస్‌ ఛాన్సలర్‌ విద్యార్థులను రెచ్చగొట్టారు’’ అని వీహెచ్ చెప్పారు. టాడా యాక్ట్ కింద ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మకు నిజంగా దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్‌ను సస్పెండ్ చేసి వర్మపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Exit mobile version