Ram Charan and Upasana Pet Dog Rhyme Helped to Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.
మరోవైపు సమాజంలో జరిగే సంఘటనలు, ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలపై తన గొంతు వినిపిస్తుంటారు. ముఖ్యంగా మూగ జీవాలపై సంరక్షణకు ఆమె పాటు పడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు మూగ జీవాల కోసం ఎన్‌జీవో కూడా నిర్వహిస్తున్నారు ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ పేరుతో సంస్థ నిర్వహించారు. అయితే వీటి కోసం ఆమె ఓ అంబులెన్స్‌ని కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న రేణు దేశాయ్.. ఇందుకులో ఎవరైనా విరాళాలు ఇవ్వోచ్చని ప్రకటన ఇచ్చారు. అది చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన వంతు సాయం అందించారు.
అయితే తన పేరుతో కాకుండా తమ పెంపుడు కుక్క రైమ్ పేరుతో రేణు దేశాయ్ ఎన్‌జీవో సంస్థకి ఆమె విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. “అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కి ఉపాసనను కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక ఉపాసనది గొప్ప మనసు అంటూ నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు.
కాగా రేణు దేశాయ్‌కి మూగజీవాలంటే ఇష్టమని తరచూ చెబుతుంటారు. అంతేకాదు వాటి సంరక్షణకు పాటుపడాలని ప్రతి ఒక్కరిని ఆమె విజ్ఞప్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తన కూతురు ఆద్యా పేరుతో ఎన్జీవోను స్థాపించారు. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ షేర్ చేస్తూ.. “నా ఎన్నో ఏళ్ల కల నేరవేరింది. ఈ రోజు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షణకు ఏదైనా చేయాలని అనునకునేదాన్ని. చాలాసార్లు నా వంతు సాయం కూడా అందించాను. కోవిడ్ టైంలోనే స్వయంగా వాటి సంరక్షణకు ఓ ఎన్‌జీవో స్థాపించాలని నిర్ణయించుకున్న” అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.