Site icon Prime9

Rashmika Mandanna : అరుదైన ఘనత సాధించిన “రష్మిక మందన్న”.. ఆ విషయంలో ఫస్ట్ సౌత్ హీరోయిన్

Rashmika Mandanna nominated as best asian actress in septimius awards 2023

Rashmika Mandanna nominated as best asian actress in septimius awards 2023

Rashmika Mandanna : నేషనల్ క్రష్ “రష్మిక మందన్న” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “రష్మిక మందన్న” .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ. ఈ మూవీతో దక్షిణాది లోనే కాకుండా ఉత్తరాది లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి.

గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక (Rashmika Mandanna) కు… ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన “మిషన్ మజ్ను” మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కానీ సందీప్ రెడ్డి వంగా – రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న “యానిమల్” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అలానే వీటితో పాటు రెయిన్ బో, ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమాల్లో నటిస్తుంది. కాగా తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఏ ముద్దగుమ్మను ఫ్యాన్స్ అంతా “నేషనల్ క్రష్” అని పిలుస్తుంటారు.

అయితే తాజాగా రష్మిక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ ఘనతను ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్ పొందకపోవడంతో.. మొదటి సౌత్ హీరోయిన్ గా పేరు పొందుతుంది. ఏంటంటే.. బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ అవార్డుకు రష్మిక నామినేట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన అవార్డుల్లో సెప్టిమియస్ అవార్డ్స్ కూడా ఒకటి. 2023 సంవత్సరానికి గాను బెస్ట్ ఏసియన్ యాక్ట్రెస్ విభాగంలో రష్మిక పేరు నామినీగా ఉండడం విశేషం. ఇక బెస్ట్ ఏషియన్ యాక్టర్ విభాగంలో మలయాళ నటుడు టోవినో థామస్ నిలవగా.. బెస్ట్ ఏషియన్ మూవీ విభాగంలో 2018 నామినేట్ అయ్యింది. నెదర్లాండ్స్ లోని ఆంస్టర్డమ్ లో  ఈ అవార్డు ఫంక్షన్ జరుగునుంది.

ఈ విషయంపై స్పందించిన రష్మిక వారికి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది. “ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇది. థాంక్యూ ఇదంతా కేవలం మీ ప్రేమ వలనే దక్కింది. మీ అందరికీ నేనెప్పుడూ ఋణపడి ఉంటాను” అంటూ రాసుకొచ్చింది.

 

Exit mobile version