Site icon Prime9

Rashmika Mandanna: ‘పుష్ప 2’పై శ్రీవల్లి అదిరిపోయే అప్‌డేట్‌ – ఫస్టాఫ్‌ అద్భుతవం.. సెకండాఫ్‌ అంతకు మించి..

Rashmika comments on Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది. 2021లో పుష్ప: ది రైజ్‌కు ఇది సీక్వెల్‌. దీంతో పుష్ప: ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ షూట్ అయిపోయింది. ఇక రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుంటం మేకర్స్ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో పుష్ప 2పై రష్మిక మందన్నా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. మూవీ షూటింగ్‌ చాలా ఆసక్తిగా సాగిందని, దాదాపు షూటింగ్‌ పూర్తయ్యిందని తెలిపిందే. ప్రస్తుత డబ్బింగ్‌ వర్క్ జరుగుతుందని, తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నట్టు పేర్కొంది.

“సినిమా షూటింగ్‌ అంతా చాలా సరదాగా సాగింది. సెట్‌లో చాలా ఎంజాయ్‌ చేశాను. దాదాపు షూటింగ్‌ పూర్తయ్యింది. ఇప్పటికే ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ కూడా చెప్పేశా. ప్రస్తుతం సెకండాఫ్‌కి డబ్బింగ్‌ చెబుతున్నా. ఫస్టాఫ్‌ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. దానిని మాటల్లో చెప్పలేను. ఇక సెకండాఫ్‌ అంతకు మించి అన్నట్టు ఉంది. థియేటర్లకు వెళ్లిన ప్రతి ఆడియన్‌ థ్రిల్‌ ఫీల్‌ అవుతున్నారు. పుష్ప 2లోని ప్రతి సీన్‌ మీకు మైండ్‌ బ్లోయింగ్‌ అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. రిలీజ్‌ వరకు ఆగలేకపోతున్నా. ఇక పుష్ప 2 షూటింగ్‌ పూర్తవుతున్నందుకు చాలా బాధగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

వరల్డ్‌ వైడ్‌గా పుష్ప క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈసినిమాతో బన్నీ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఏకంగా అతడి నేషనల్‌ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఫస్ట్‌ పార్ట్‌ భారీ విజయం సాధించడమే కాదు ఎన్నో రికార్ట్స్‌ నెలకొల్పింది. మ్యూజిక్ పరంగానూ పుష్ప: ది రైజ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. నేషనల్‌, ఇంటర్నేషనల్‌ వేదికలపై ఈ పాటలు మారుమోగాయి. ముఖ్యంగా శ్రీవల్లి, ఊ అంటావా మావా పాటలు యమ జోరు చూపించాయి. ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసిన ఇవే పాటలు మారుమోగాయి. దీంతో సెకండ్‌ పార్ట్‌లోనూ స్పెషల్‌ సాంగ్‌ పెద్దపీట వేసింది మూవీ టీం. ఈ సాంగ్ యంగ్‌ సెన్సేషన్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలను రంగంలోకి దింపాడు సుకుమార్‌.

ఇటీవల కిస్సిక్‌ అంటూ సాగే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇందులో శ్రీలీల లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఈ సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌ వంటి తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 11500 స్క్రిన్లలో విడుదల అవుతుండగా.. ఇడియాలో 6వేల, ఓవర్సిస్‌లో 5వేల స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించింది.

Exit mobile version