Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసిందే.
జూన్ 16న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నారు. ఇక ఇటీవల జై శ్రీరామ్ అనే సాంగ్ ని రిలీజ్ చేయగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది. 100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన ఈ ఒక్క పాట మంచి చాట్ బస్టర్ లాగా మారింది. తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.
“రామ్ సియా రామ్” అని సాగే ఈ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీ (Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న నిర్వహించబోతున్నారు. తిరుపతిలో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఆదిపురుష్ కి కూడా వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టీజర్ తో మూవీపై భారీగా నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ట్రైలర్ తో ఆ నెగిటివిటీ అంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన జై శ్రీరామ్ సాంగ్ అయితే అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది. 100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన ఈ ఒక్క పాట మంచి చాట్ బస్టర్ లాగా మారింది. ఈ తరుణంలోనే ఈ సాంగ్ కూడా అందర్నీ ఖచ్చితంగా అలరిస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.
‘రామ్ సియా రామ్’ అనే సాంగ్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేశారు. అయితే సాధారణంగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడమే కాకుండా మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మధ్యాహ్నం 12 గంటలకు ‘రామ్ సియా రామ్’ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించడం విశేషం అని చెప్పాలి.