Pawan Kalyan In Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2) ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.
కొంతకాలంగా పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటిటిలో ప్రసారం మొదలైంది.
ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా సర్వర్లు క్రాష్ అయ్యాయి. అంతలా బాలయ్య షోకి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాజరైన ఎపిసోడ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గురించి బాలయ్య సంచలన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అందులో భాగంగా.. ప్రభాస్ ఎపిసోడ్ తరహాలోనే ఈ ఎపిసోడ్ లో కూడా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని ఫోన్ లైన్ లో తీసుకున్నారు.
మీ నాన్న దగ్గర లేనప్పుడు మీ బాబాయ్ తో జరిగిన పెద్ద సీక్రెట్ ఏంటి అని బాలయ్య ప్రశ్నించారు.
దీనికి సమాధానం ఇస్తూ రాంచరణ్ ఒక సెన్సేషనల్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్ పంచుకున్నారు.
బాబాయ్ లైఫ్ బోరింగ్ అంటున్న చరణ్..
తనకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తో సింగపూర్ కి వెళ్ళాను. దగ్గర నాన్న, అమ్మ ఎవరూ లేరు.
దీనితో కళ్యాణ్ బాబాయ్ తో కలసి పిజ్జాలు, బెర్గర్ లు ఇష్టం వచ్చినట్లు తినేసా.
అవి తేడా కొట్టి ఒక చోట విపరీతంగా వాంతులు చేసుకున్నా.
అప్పుడు కళ్యాణ్ బాబాయ్.. నేను వాంతులు చేసుకున్న దానిని, నన్ను తన చేతులతో క్లీన్ చేశాడు అని రాంచరణ్ రివీల్ చేశాడు.
చిన్నప్పుడు రాంచరణ్ ని , సాయిధరమ్ తేజ్, పిల్లల్ని చూసుకునే డ్యూటి తనకే ఉండేదని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు.
అలానే చరణ్ ఎప్పుడైనా చెప్పిన మాట వినకపోతే చిరంజీవి అతడిని పవన్ కళ్యాణ్ దగ్గరకి పంపేవారట. దీనితో పవన్ క్లాస్ పీకడం, హితబోధ చేయడం చేసేవారట.
పవన్ కళ్యాణ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అని బాలయ్య రాంచరణ్ ని ప్రశ్నించగా.. ఏమీ ఉండదు అండీ.. ఆయన లైఫ్ చాలా బోరింగ్ అని రాంచరణ్ ఫన్నీ కామెంట్స్ చేశారు.
అదే విధంగా పవన్ ని ఎక్కువగా పూజలు, ధ్యానం చేస్తావు కదా, నీకు భక్తి ఎక్కువ కదా అని బాలకృష్ణ అడిగాడు.
పవన్ కళ్యాణ్ దీనికి సమాధానమిస్తూ.. ఒకప్పుడు నేను విగ్రహారాధన చేసేవాడ్ని కాదు.
ధ్యానం, యోగా లాంటివి చేసేవాడ్ని. దేవుడ్ని నమ్ముతాను కానీ దీపం పెట్టుకొని ధ్యానం చేసేవాడ్ని.
ఒక గురువు కలిసి నన్ను గమనించి చెప్పి విగ్రహారాధన చేయమన్నారు.
అలా దుర్గాదేవిని ప్రార్ధించడం మొదలుపెట్టాను. అలా అందర్నీ పూజిస్తాను అంతేకాని పూజలు.. ఇలా మరీ ఎక్కువగా ఉండవు అని అన్నాడు.
చరణ్ కి ఎక్కువ భక్తి కదా అని బాలకృష్ణ అడగగా.. చరణ్ కి భక్తి ఎక్కువే. సంవత్సరంలో 200 రోజులు ఏదో ఒక మాలలోనే ఉంటాడు. నా దగ్గర్నుంచి అది నేర్చుకోలేదు. వాడి స్వతహాగా నేర్చుకున్నాడు అది అని చెప్పాడు. దీంతో చరణ్ – పవన్ అనుబంధం గురించి కూడా అడిగాడు బాలయ్య.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఓటీటీ రికార్డులు తిరగరాస్తూ ట్రెండ్ ని క్రియేట్ చేస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/