RRR: Behind and Beyond Documentary Trailer: తెలుగు సినీ పరిశ్రమ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమ ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలవడంతో ఇంటర్నేషనల్ వేదికలపై ఈ సినిమా పేరు మారుమోగింది. ఆస్కార్‌తో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది.
ఎన్నో రికార్డులతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ చేసింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌పై డాక్యుమెంటరీని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెరవెనుక విషయాలు, విశేషాలను ప్రేక్షకులు అందించేందుకు ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ (RRR: Behind And Beyond) పేరుతో ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. డిసెంబర్ 20న ఇది ఎంపిక చేసిన పలు థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో మూవీలో కీలక సన్నివేశాలను చూపిస్తూ దానికి వెనక డైరెక్టర్, కాస్ట్ అండ్ క్రూ ఎంతగా శ్రమించారో చూపించారు.
అంతేకాదు ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాట మేకింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. అలాగే ఫారిన్ నటీనటులు కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించబోతున్నారు. అలాగే అలియా భట్, అజయ్ దేవగన్‌లో కూడా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సెట్‌లో స్పెషల్ మూమెంట్స్‌తో పాటు తమ అనుభవాలని ఈ డాక్యుమెంటరీ పంచుకోబోతున్నారు. అలాగే నీటిలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లో సీన్స్, పులి సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్‌పై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సన్నివేశాల చిత్రీకరణ టైంలో తమకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల గురించి వివరించారు. అలాగే రాజమౌళి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించిన ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు. ఇలా ఆసక్తిగా ఈ ట్రైలర్ డాక్యుమెంటరీ ఆసక్తిని పెంచుతుంది.