Site icon Prime9

Rahul Jodo Yatra: ఒక్కసారిగా పరుగు తీసిన రాహుల్.. జోడో యాత్రలో చిత్ర విచిత్రాలు

Rahul dancing running in jodo yatra

Rahul dancing running in jodo yatra

Rahul Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. రాహుల్‌ తమాషాలు చూస్తూ ప్రజలు అబ్బురపడ్డారు. ఆయన ఏ క్షణం ఏం చేస్తున్నారో తెలియక, ఆ స్థాయిని అందుకోలేక స్థానిక కాంగ్రెస్‌ నేతలు చతికిలబడిపోతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ పని చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. నాలుగు రోజుల క్రితం తెలంగాణలోకి అడుగుపెట్టిన జోడో యాత్రలో రాహుల్ తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్నా పెద్దా, ఆడా మగా ఇలా అందర్నీ తనవైపుకు ఆకర్శిస్తున్నారు.

నా స్పీడుని ఎవరూ అందుకోలేరు

తెలంగాణలో నేడు 5వ రోజు భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాహుల్ గాంధీ భిన్నమైన శైలితో ప్రజలను అలరించారు. జడ్చర్లలో ర్యాలీకి వచ్చిన స్కూల్‌ పిల్లలతో మాట్లాడుతూనే ఒక్కసారిగా రాహుల్ పరుగు మొదలెట్టాడు. అసలు రాహుల్‌ ఏం చేస్తున్నాడో అర్థం కాక అక్కడున్న వారు అయోమయానికి గురయ్యారు. దాని నుంచి తేరుకుని వెంటనే ఆయనతో పాటు పరుగులు తీశారు. రాహుల్ స్పీడ్‌ను పిల్లలు కూడా అందుకోలేక పోయారు. రేవంత్‌రెడ్డి కూడా ఆయన పరుగు స్వీడుని అందుకోలేక వెనుకబడిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య చేతులు పట్టుకుని పరుగు పెట్టడంతో అక్కడ ఉన్న నేతలు కేకలు వేస్తూ ఆయనను ఉత్సాహపరిచారు.

బతుకమ్మ పాటకు పాదం కలిపిన రాహుల్

తదనంతరం రాహుల్ యాత్ర గోలపల్లి చేరుకుంది. అక్కడి మహిళలతో కలిసి రాహుల్‌ బతుకమ్మ ఆడారు. జైరాం రమేష్, రేవంత్‌రెడ్డి కూడా ఆయనతో పాటు పాదం కదిపారు. బతుకమ్మ పండుగ గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు రాహుల్‌. ఇలా జోడో యాత్రలో రాహుల్ జోరు కనపరుస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

ఇదీ చదవండి: సీబీఐ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Exit mobile version