Site icon Prime9

Suresh Babu : ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న ప్రొడ్యూసర్ సురేష్ బాబు… వైరల్‌గా మారిన వీడియో

producer suresh babu clearing traffic in film nagar and video goes viral

producer suresh babu clearing traffic in film nagar and video goes viral

Suresh Babu : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీంతో ఆయన చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయి ఉండి బాధ్యత గల పౌరుడుగా ఆయన వ్యవహరించారని నెటిజన్లు అంతా ప్రశంసిస్తున్నారు.

హైదరాబాద్ లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు రావటమే ఈ ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గత కొంతకాలంగా సినిమాలు తీయటం తగ్గించారు. ఇటీవల సురేష్ బాబు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల గురించి స్పందించారు. తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం సరైనది కాదన్నట్టు సురేష్ బాబు మాట్లాడారు.

ఇతర భాష చిత్రాలను ఎవరు ఆపలేరని సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడుతాయని ఆయన వెల్లడించారు. తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయని మన సినిమాలను ఏ భాషలో కూడా చులకనగా చూడలేదని వివరించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో చెన్నైలో కూడా చిన్న సినిమాలకు కాస్త ఇబ్బంది ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

Exit mobile version