Prime9 News CEO P.Venkateswararao : ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలను నిర్మించి మంచి హిట్ లను సాధించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. క్రిష్ దరకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రత్నం ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి విచ్చేశారు. ఈ క్రమంలోనే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో వెంకటేశ్వరరావుతో ఆయన భేటీ అయ్యారు.
ఈ మేరకు పలు సినిమా అంశాలు, రాజకీయాల గురించి వారి చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అలానే రత్నంను.. సీఈవో వెంకటేశ్వరరావు సత్కరించి భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత తోడ్పాటు అందించేలా చిత్రాలు తెరకెక్కించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కాసేపు సరదాగా ముచ్చటించారు.
అలానే రత్నం నిర్మాణంలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు టాలీవుడ్, బాలీవుడు తారాగణం ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి మూవీకి సంగీతం అందించడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. అయితే దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా కరోన వల్ల కొంత ఆలస్యం అవ్వగా.. పవన్ రాజకీయాలు, ఇతర సినిమాల కారణంగా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.