Priyanka Jawalkar : తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు.
పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు.
ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో “ప్రియాంక జవాల్కర్” కూడా ఒకరు.
అనంతపురానికి చెందిన ఈ ముద్దుగుమ్మ విజయ్‌దేవరకొండ సరసన ‘ట్యాక్సీవాలా’ సినిమాలో నటించి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత తెలుగులో సత్యదేవ్ సరసన ‘తిమ్మరుసు’, కిరణ్ అబ్బవరంకి జోడీగా ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’, ‘గమనం’ వంటి సినిమాల్లో కనిపించింది.
ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు.
కాగా ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ అమ్మడుకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది.
తాజాగా మరోసారి తన అభిమాన హీరో గురించి బయటపెట్టింది ప్రియాంక. పవన్ కల్యాణ్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని.. ఆయన నటించిన అన్నీ సినిమాలు చూస్తానని తెలిపింది.
తమ్ముడు సినిమా 20 సార్లు చూశానని.. ఖుషి సినిమాలోని అన్ని డైలాగులు అలవోకగా చెప్పేస్తానని తెలిపింది ఈ భామ.
ప్రియాంక ఎందుకు నటించనని చెప్పిందంటే..
అలానే ప్రియాంక మాట్లాడుతూ.. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది.
అంత పెద్ద స్టార్ అయినా కూడా అంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు అని చెప్పింది.
ఇక వెంటనే యాంకర్.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అని అడగగా.. చేయను అని చెప్పి షాక్ ఇచ్చింది. కాగా అందుకు గల కారణాన్ని తెలుపుతూ పవన్ కళ్యాణ్‌తో నటించాలనే కోరికే నాకు లేదు. వీరాభిమానిగా పవర్ స్టార్‌ని దూరం నుంచి చూడటం నాకు ఇష్టం.
అంతకు మించి ప్రస్తుతానికి నేను ఏమీ ఆశించడం లేదు’ అని ప్రియాంక జవాల్కర్ స్పష్టం చేసింది.
ఎప్పటికీ ఆయన్ని అభిమానిస్తూ ఉండిపోతా.. ఈ జీవితానికి అది తప్ప మరొకటి అవసరం లేదు అని చెప్పింది.
ఇక షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్ ప్రారంభించిన ప్రియాంక.. టాక్సీవాలా మూవీలో కాస్త హోమ్లీగా కనిపించిన ఆ తర్వాత సినిమాల్లో గ్లామర్‌గా కనిపించింది.
ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటుంది.
ముఖ్యంగా తన ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోల్ని షేర్ చేస్తుంటుంది ప్రియాంక.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చూడాలి మరి నిజంగా ఛాన్స్ వస్తే ప్రియాంక ఎస్ చెప్పిద్దా? నో చెప్పిద్దా ?? అని.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/