Site icon Prime9

Hyderabad: 11న హైదరాబాదుకు ప్రధాని నరేంద్ర మోదీ

Prime Minister Narendra Modi to Hyderabad on 11

Prime Minister Narendra Modi to Hyderabad on 11

Pm Modi: ప్రధాని మోదీ 11వ తేది భాగ్యనగరానికి రానున్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నెల 10 నుండి 14 వరకు సదస్సు జరగనుంది. సదస్సులో 120 దేశాలకు చెందిన రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు.

మరో వైపు కేసిఆర్ 5న జాతీయ పార్టీ పై కీలక ప్రకటన చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ నగరానికి రానున్నడంతో రాజకీయ సందడి ఎక్కువైంది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఈసీ ప్రకటించిన అనంతరం మోదీ హైదరాబాదు పర్యటనపై నేతల హడావుడి ఎక్కువైంది. ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. సదస్సులో పొల్గొనడానికి ముందే బేగంపేట్ ఎయిర్ పోర్టులో కీలన భాజపా శ్రేణులతో మోదీ సమావేశం కానున్నట్లు సమాచారం.

మునుగోడు విజయాన్ని మోది కానుకగా ఇచ్చేందుకు తెలంగాణ భాజపా నేతలు ఊవిళ్లూరుతున్నారు. ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాను చేస్తున్న పాదయాత్రను సైతం వాయిదా వేసుకొన్నారు. 7వ తేది నుండి మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించేలా మ్యాప్ సిద్దం చేసుకొంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లుతూ తన ప్రచారాన్ని చేపట్టాలని బండి భావిస్తున్నారు. 189 గ్రామాల్లో భాజపా బైక్ యాత్రలు చేపట్టనుంది. 10వ తేదీ మరింతగా ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ భాజపా ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ నాంపల్లిలో ముఖ్య నేతలతో సమావేశమైనారు.

మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికలు అటు అధిష్టానంతోపాటు భాజపా, కాంగ్రెస్ లకు కీలకంగా మారింది.

ఇది కూడా చదవండి:Kishan Reddy: దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ మాటలు అవివేకమే..కిషన్ రెడ్డి

Exit mobile version