Prakasam Barrage: తెలుగురాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా కృష్ణాజిల్లాలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో ప్రాజెక్టు అధికారులు 70గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.
ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు జలదిగ్భందంలో ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎడతెరిపి లేని వానలతో చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దీనితో జలాశయ నిర్వహణ అధికారులు బ్యారేజ్ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తూ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి తెలిపారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో 4,12,769 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. కాగా కృష్ణమ్మ పరవళ్లను చూడడానికి స్థానిక ప్రజలు బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి: Nagarjuna Sagar: సాగర్ ఎడమ కాల్వకు గండి.. నీటమునిగిన నిడమానూరు..!