Site icon Prime9

Postponed Janasena Yatra: వాయిదా పడ్డ జనసేన యాత్ర

Postponed Janasena Yatra

Postponed Janasena Yatra

Amaravathi: మంగళగిరిలో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వేగంగా అధికారంలోకి రావడం ఒక్క నందమూరి తారక రామారావుకే చెల్లిందని చెప్పారు. నేడు అలాంటి మార్పు అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి 10 సీట్లు వచ్చినా తన పోరాటం మరోలా ఉండదని పవన్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల అనంతరం పార్టీని వదిలి వెళ్లిపోతానని చాలా మంది ఊహించారన్న పవన్ అలాంటి వారి కోరిక నెరవేరలేదని పేర్కొన్నారు. నా దేశాన్ని, నా నేలను, నా పార్టీని వదిలేదని స్పష్టం చేశారు.

ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పవన్ భాదను వ్యక్తం చేసారు. నాడు చిన్న రాజధాని చాలన్న ఆలోచనలతో అమరావతికి వేల ఎకరాలు వద్దన్నాని తెలిపాను. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 30వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కొరకు అవసరమని అన్నారని పరోక్షంగా జగన్ ఉద్దేశించి పవన్ పేర్కొన్నారు. ఆనాడు రాజధానికి నేను సుముఖం అంటూ ఇల్లు కట్టిన మాట వాస్తవం కాదా అని జగన్ ను ప్రశ్నించారు. ఓట్లు వేయించుకొని అధికారం చేతపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసారని పవన్ జగన్ పార్టీపై మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో వివాదం చేసింది జగన్ అంటూ మాట్లాడారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీకి 47 నుండి 67 సీట్లు సాధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక ఉండాలన్నారు. సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. గెలుపును సాధించేంతవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి తమ పార్టీ సిద్ధమని స్పష్టం చేశారు. 2019లో ప్రజలు వైకాపాకు ఓటు వేసారని, దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version