Site icon Prime9

Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ద్రోహి అంటూ రాజగోపాల్ రెడ్డిపై పోస్టర్లు

Hyderabad: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతున్న రాజగోపాల్‌ రెడ్డిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్స్‌లో రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే, అమిత్ షాను బేరామాడిన దుర్మార్గుడివి అంటూ పోస్టర్లలో ముద్రించి గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. మునుగోడు నిన్ను క్షమించదు అంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Exit mobile version