Pawan Kalyan: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు
చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రాజకీయ జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా కలిగిన నాయకుడిగా రామనారాయణ రెడ్డికి పేరుందని.. ఇక ఆయనే ఆందోళన చెందుతుంటే..
మిగతా నాయకుల పరిస్థితి ఏమిటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఏపీలో శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
‘మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది. ప్రభుత్వ వ్యవహార శైలి గురించి, తన నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం వంటి అంశాలపై
తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరమా? ఆయనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని సైతం తగ్గించారు.
ఈ పరిణామాలను చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి.
ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోమ్ శాఖకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పై లేఖ రాస్తాను ’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారని.. కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.
సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోందన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే.. డీజీపీ, హోమ్ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు.
రామనారాయణ రెడ్డికి ప్రాణ హాని , కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు.
నెల్లూరు మాఫియా ఆగడాలను ప్రశ్నించినందుకు తన ఫోన్లు ట్యాంపింగి లో ఉన్నాయన్నారు.
తన కదలికలను పరిశీలిస్తూ.. తనను లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తనకు భద్రత తొలగించడంపై పార్టీ అధిష్టానమే సమాధానం చెప్పాలన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/