Site icon Prime9

Unstoppable Show : వాళ్లు ఊర కుక్కలు… పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్లు చేసే బ్యాచ్‌పై బాలయ్య ఫైర్… వైఎస్ జగన్‌ను కూడా కలిపేశారా?

perni-nani-comments-on-balakrishna-pawan-kalyan-unstoppable-show

perni-nani-comments-on-balakrishna-pawan-kalyan-unstoppable-show

Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది. అయితే ఇటీవలే ఈ షో లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి పవన్ షో లో ఎప్పుడు పాల్గొంటారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలోనే 27వ తేదీన అన్నపూర్ణ స్టూడియో లో ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ జరిగింది. అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోకు పెద్ద ఎత్తున చేరుకొని ఓ రేంజ్ లో హంగామా చేశారు. గెస్ట్ లతో తనదైన శైలిలో ఆడుకుంటున్న బాలయ్య… పవన్ కళ్యాణ్ ని ఏమని ప్రశ్నలు అడుగుతారు. వారి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అని నందమూరి, మెగా ఫ్యామిలీల అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక టాక్ షో లో పాల్గొనడం తో ఈ ఎపిసోడ్ కి మరింత బజ్ ఏర్పడింది.

కాగా అందరూ అనుకున్నట్లు గానే ఈ ఎపిసోడ్ చాలా సరదాగా జరిగిందని షూట్ లో పాల్గొన్నవారు చెబుతున్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటిని కవర్ చేస్తూ బాలయ్య ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అలానే పవన్ మూడు పెళ్లిలపై కూడా బాలయ్య ప్రశ్న అడిగారట. రాజకీయాల్లో పవన్ ప్రత్యర్ధులు అంతా ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. వారందరికీ ఈ వేదికగా కళ్యాణ్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారని సమాచారం అందుతుంది.

తానేది కావాలని చేసింది కాదని, తనకు ఆ రిలేషన్ సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు ఇద్దరి అభిప్రాయంతోనే విడిపోయినట్లు చెప్పారట… అంతే కాకుండా ఒకరికి విడాకులు ఇచ్చిన తరువాతనే మరొకరిని పెళ్ళాడనని, వారి అనుమతి తోనే విడిపోయాయని చెప్పారట. ఇక పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన బాలయ్య సైతం… ఒకరి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం ఈజీ ఏమో… కానీ వారు ఎంతలా బాధపడతారో అర్ధం చేసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు వారి కుటుంబాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని అన్నారట. అలానే మరోసారి పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే వారు ఊరకుక్కలతో సమానం అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. దీంతో అభిమనులంతా జై పవర్ స్టార్, జై బాలయ్య అంటూ నినాదాలు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తుంది.

Exit mobile version