Site icon Prime9

Janasena Formation Day : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ “దిగ్విజయ భేరి”.. సభా ప్రాంగణం రూట్ మ్యాప్

pawan kalyan janasena formation day meeting place route map details

pawan kalyan janasena formation day meeting place route map details

Janasena Formation Day : పవన్ కళ్యాణ్ సారధ్యంలోని  జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. “దిగ్విజయ భేరి” పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాటు చేయగా.. ఎల్ ఈడీ స్క్రీన్స్ తో 10 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ ఆటోనగర్ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి నుంచి ర్యాలీగా సభా వేదికకు చేరుకుంటారు. మొదటిసారి పవన్ వారాహిపై రానుండడం గమనార్హం.  సభా స్థలంలో 1,20,000 మంది పైగా కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ మేరకు ఏపీ లోని అన్ని జిల్లాల నుంచి జనసేన పార్టీ నేతలు , కార్యకర్తలు మచిలీపట్నం చేరుకుంటున్నారు. ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పవన్ ఏం ప్రకటన చేస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ క్రమంలోనే సభా వేదికకు చేరుకునేందుకు జనసేన పార్టీ రూట్ మ్యాప్ కి సంబంధించిన వీడియో ని పోస్ట్ చేశారు.

పలు ప్రాంతాల నుంచి సభా (Janasena Formation Day) వేదికకు రూట్ మ్యాప్..

ఉత్తరాంద్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారికి, నర్సాపురం, భీమవరం మీదుగా ఉభయ గోదావరి జిల్లాల వారికి.. రాయలసీమ నుంచి వచ్చే వారికి.. తెనాలి, రేపల్లె నుంచి వచ్చే వారికి.. రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి సభ వేదికకు చేరుకునేందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నందున జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంది. అదే విధంగా పోలీసుల సూచనల మేరకు జనసేన సైనికులు, కార్యకర్తలు జాగ్రత్తగా రావాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version