Site icon Prime9

Minister Roja: పవన్ కళ్యాణ్ దిగజారిపోతున్నాడు.. మంత్రి రోజా

Minister Roja

Minister Roja

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. యువతకు చదువు ఒకటే ముఖ్యం కాదని, క్రీడలు కూడా అవసరమేనన్నారు. తాను కూడా ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ వెనుతిరగకుండా ముందుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు.

ఆట ఏది అయినా మన లక్ష్యం సక్సెస్ పై మాత్రమే ఉండాలన్నారు మంత్రి రోజా. సీఎం జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరని, కానీ 151 సీట్లలో విజయం సాధించి అందరికీ సమాధానం చెప్పారని వివరించారు. క్రీడల్లో కష్టపడుతున్న ఆటగాళ్ళకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఎప్పటికీకీ ఉంటుందన్నారు. రాబోయే సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో రూ. 50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Exit mobile version