Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. శుక్రవారంనాడు రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రిషికొండకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ పోలీసులు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. తాము చేసిన సూచనలను పాటించాలని విశాఖపట్టణం పోలీసులు సూచించారు. రిషికొండకు సమీపంలో రోడ్డుపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారాహి వాహనంతో పాటు ఏడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘించవద్దని కూడ పోలీసులు జనసేన నేతకు సూచించారు.
Pawan Kalyan : వైజాగ్ పర్యటనలో భాగంగా రుషికొండకు జనసేనాని.. మనల్ని ఆపేది ఎవడ్రా అంటూ !

Pawan Kalyan going to rushikonda visit in visakhapatnam