Pawan Kalyan: మంగళగిరి వేదికగా కుల స్వామ్యం కాదు ప్రజాస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలానే వైసీపీ సన్నాసులతో విసిగిపోయాం.. తోలుతీసి కూర్చోబెడతాం అని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వారాహిని ఏపీలో తిరగనివ్వమని.. పేట్రేగిపోయారు అసలెలా వస్తావో చూస్తానన్నారు..
కానీ, అన్ని రూల్స్ ప్రకారమే ఎంతో ధైర్యంగా వేలాదిమంది ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల ప్రోత్సాహం నడుమ వారాహికి దుర్గమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించాను.
వారాహిపై సింహంలా ఏపీలో తిరిగాను అంటూ స్పష్టం చేశారు. నేను మీలాగా కోడికత్తి డ్రామాలు చెయ్యము అంటూ వైసీపీ నేతలను, సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు.
అవినీతిలో కూరుకుపోయిన మీకు రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది? అని తీవ్రంగా ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతా : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
మరోసారి ఏపీని విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోపెడతాం అని రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు.
వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?.. రాజ్యాంగం గురించి ఏం తెలుసు అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేర్పాటువాదం గురించి మాట్లాడితే తన అంత తీవ్రవాది ఉండడని.. వార్నింగ్ ఇచ్చారు.
అధికారం చేతుల్లో ఉంది కదాని మీ ఇష్టమొచ్చినట్లుగా చేస్తూ చూస్తూ కూర్చోమని..సన్యాసి నేతలు చేసే పిచ్చి రాజకీయాలు చూసి చూసి విసిగిపోయిన ప్రజలు మిమ్మల్ని తరమికొడతారన్నారు.
రాయలసీమ ప్రజలు బతకలేక వలసలు వెళ్లిపోతుంటే ఆ ప్రాంతంనుంచే నేతలుగా సీఎంలుగా అయినవారు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఇక చాలు..రాష్ట్రాలను విడగొట్టి ప్రజలను విడగొట్టి చిచ్చులు పెట్టింది ఇక చాలని ఇకపై విభజన రాజకీయాలు చేస్తే ఒక్కొక్కరి తోలు తీస్తాం అని ఏం తమాషాగా ఉందా? అంటూ ప్రశ్నించారు.
ఏపీలో ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారో మీకు తెలుసా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరువాసులు ప్రాణాలు అర్పించారనే విషయం మీకు తెలుసా?
మాట్లాడితే రాష్ట్రాన్ని విడగొతం పడగొడతాం అంటూ పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప అంటూ వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు పవన్.
ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలా?.. అలాంటి పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్స్ ఇవ్వద్దని కోరారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు.
యువత ఇప్పుడు బయటకు రాకుంటే, అన్యాయాన్ని ఎదుర్కొకపోతే బానిసల్లా ఉండిపోతారని అన్నారు.
‘‘పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. పార్టీ నిర్మాణానికి సమయం పడుతుంది.
పెరుగు తోడు వేస్తే.. అది తోడుకోవడానికి రాత్రి సమయం పడుతుంది.
పార్టీ నిర్మాణంపై దశాబ్దం పాటు వేచిచూసిన తర్వాత.. అప్పుడు ఎటూవైపు వెళ్తుందో చూసుకుందాం’’ అని పవన్ అన్నారు.
ప్రధాని మోడీని కలిసిపనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బహుమతులుగా ఇస్తున్నవారు కానీ రాష్ట్రంలో మాత్రం దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే మాత్రం ఏమీ చేయటంలేదంటూ సీఎం జగన్ పై సెటైర్లు పవన్.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/