Pawan kalyan: తాజాగా విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు.
బెజవాడలోని దుర్గమ్మ సన్నిధిలో కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.
అనంతరం గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి వేదపండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలి.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు.
కొంత మంది మీడియా అడిగిన ప్రశ్నలు సమాధానం ఇస్తూ గుడిలో రాజకీయాలు మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.
అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు.
ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ చెప్పారు.
రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ పేర్కొన్నారు.
కాగా, మంగళవారం కొండగట్టు, ధర్మపురిలో వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు పవన్ కల్యాణ్.
అయితే, కొండపైకి వారాహి వాహనాన్ని అధికారులు అనుమతించకపోవడంతో ఘాట్ రోడ్ లోని అమ్మవారి విగ్రహం ముందు పూజలు చేశారు.
అమ్మవారి దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు.
జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదు.
పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అభిమానుల ఒత్తిడిని గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో అడుగుడుగునా జనసేన అభిమానులు, నేతలు వారాహి తో సెల్ఫీ లు తీసుకునేందుకు పోటెత్తారు.
పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అభిమానుల ఒత్తిడిని గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.
పవన్ (Pawan kalyan) రాకతో జనసంద్రంగా బెజవాడ..
కాగా, పవన్ రాక నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్ కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకొని పవన్ కు ఘన స్వాగతం పలికారు.
పవన్ కు, వారాహి వాహనానికి గజమాల వేసి సత్కరించారు. ప్లై ఓవర్ పై నుంచి పవన్ పై పూల వర్షం కురిపించారు.
ఈ పూజ కార్యక్రమాల అనంతరం పవన్ తిరిగి మంగళగిరి లోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
అక్కడ పార్టీ నాయకులతో పార్టీ భవిష్యత్తు రాజకీయాల గూర్చి చర్చించనున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన నేతలు ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/