Site icon Prime9

Chegondi Venkata Harirama Jogaiah : హరిరామ జోగయ్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్..

pawan kalyan birth day wishes to Chegondi Venkata Harirama Jogaiah

pawan kalyan birth day wishes to Chegondi Venkata Harirama Jogaiah

Chegondi Venkata Harirama Jogaiah :  మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత చేగొండి వెంకట హరిరామ జోగయ్య రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ నిర్మాత గాను జోగయ్య సేవలు అందించారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈయన ఈరోజు 86 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలానే సోషల్ మీడియా వేదికగా కూడా విషెస్ తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా హరిరామ జోగయ్యకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ లో సీనియర్ రాజకీయ కోవిదుడు, సామాజికవేత్త, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని కాంక్షించే చేగొండి హరిరామ జోగయ్యకి గౌరవ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జోగయ్య నాటి తరం నేటి తరం రాజకీయాలకు వారధి వంటి వారు. చట్టసభల సభ్యునిగా, మంత్రివర్యునిగా తాను నిర్వర్తించిన పదవులకు వన్నె తెచ్చారు. రాజకీయాలలో దైర్యం, మనోనిబ్బరం, ఆత్మాభిమానంతో ఎలా పని చేయవచ్చునో ఆయన ఆచరించి చూపారు. జనసేన దినదినాభివృద్ధికి జోగయ్య ఇచ్చే సలహాలు ఎంతో ఉపయోగకరమైనవి. ఎనిమిదిన్నర దశాబ్దాల వయస్సులో కూడా విశ్రాంతికి పరిమితం కాకుండా ఆయన ఇప్పటికీ చేస్తున్న రాజకీయ శ్రమ కొనియాడతగినది. ఈసారి ఆయన తన జన్మదినాన్ని అణగారిన వర్గాల మధ్య జరుపుకోవడం ఆయన లోని సామాజిక ఔచిత్యానికి నిదర్శనంగా భావిస్తున్నాను. ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, సంపూర్ణాయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ నోట్ విడుదల చేశారు.

 

 

హరిరామ జోగయ్య (Chegondi Venkata Harirama Jogaiah) జననం..

కాగా హరిరామ జోగయ్య నారాయణ స్వామి, కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.

రాజకీయం..

1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. 1972 – 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983, 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు, పరిశ్రమల మంత్రిగా పని చేశారు. అలానే 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

నిర్మాతగా..

హరిరామ జోగయ్య చిలకమ్మ చెప్పింది, నాలాగే ఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో చేగొండి హరిబాబు గా ఆయన ప్రసిద్ధి చెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది కూడా ఈయనే. అదే విధంగా 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు.

Exit mobile version