Package Star Jagan: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పరవాడ లోని జేఎన్ ఫార్మాసిటీలో డిసెంబర్ 26న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్(Laurus labs) యూనిట్ 3లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా, మరొకరు 80 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబందించి లారస్ ల్యాబ్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ నిర్వహణలో నిర్లక్ష్యం తో పాటు తదితర కారణాలను చూపిస్తూ పలు సెక్షన్ కింద కేసు పెట్టారు. అదే విధంగా ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే చర్యలు మాట పక్కన పెడితే.. ప్రభుత్వం లారెస్ సంస్థ అడుగులకు మడుగులొత్తుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ వార్త.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘నాడు-నేడు’ పథకానికి ఇదే లారస్ ల్యా బ్స్ యాజమాన్యం రూ. 4 కోట్లను విరాళమిచ్చింది. ఈ మేరకు సోమవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని (CM Jagan) లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో చావా సత్యనారాయణ కలిసి చెక్కును అందజేశారు. ఇప్పటికే రెండు సార్లు విరాళం అందించిన లారస్ సంస్థ ఇపుడు మూడో విడత విరాళం అందించింది.
ఏపీ ప్రభుత్వానికి (AP Govt) లారస్ ల్యాబ్స్ విరాళం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తరచుగా కంపెనీకి చెందిన ఫార్మాసిటీల్లో ప్రమాదాలు జరుగుతుండటం అయినా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు, ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే లారస్ ల్యాబ్స్ లో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై కేసుల మాఫీతో పాటు.. తదితర విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే ఏపీ ప్రభుత్వానికి లారస్ సంస్థ(Laurus labs) విరాళాల పేరుతో డబ్బులు ముట్టజెప్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వమే సంస్థలను చూసి చూసినట్టు వదలివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు తీసి అడుగు వేస్తే విమర్శలుకు దిగుతారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రతీ చర్యపై విమర్శలు చేసే ఏపీ ప్రభుత్వం.. తాము చేసే పనులను మాత్రం మసి పూసి మారేడు కాయ చేస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును.. పవన్ కలిస్తే ఎంత ప్యాకేజీ గురించి చర్చించారని ప్రచారం చేసిన వైసీపీ నేతలు లారస్ కంపెనీ వ్యవహారం పై ఎందుకు మాట్లాడటం లేదని జనసేన (JanaSena) నేతలు ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితం పరివాడలో ప్రమాదం జరిగి నలుగురు మరణిస్తే.. నిన్నఆ సంస్థ రూ. 4 కోట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రూ. 4కోట్ల ప్యాకేజీ ఇచ్చారన్నారు. ‘సంస్థపై కేసులు లేకుండా చనిపోయిన నలుగురికి.. ఒక్కొక్కరికి కోటి చొప్పున నాలుగు కోట్లు ప్యాకేజీ తీసుకున్నారా.. ఇపుడు ఎవరు ప్యాకేజీ స్థార్ అనేది లింక్ క్లియర్ అయింది.. శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదేకదా.. అందుకే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తిట్టేది’ అని సెటైర్లు వేస్తున్నారు జనసైనికులు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/