Site icon Prime9

Mechanic Rocky: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్‌ మూవీ – స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Mechanic Rocky OTT Streaming: విశ్వక్‌ సేన్‌ మెకానిక్‌ రాకీ సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది. నవంబర్‌ 14న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీకి రావడంతో సినీ ప్రియులంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ‘మాస్‌ కా దాస్’ విశ్వక్‌ సేన్‌ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఏడాది రెండు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్‌ గోదావరి వంటి సినిమాలు చేసిన విశ్వక్‌ ఇటీవల మెకానిక్‌ రాకీతో అలరించాడు. మెసేజ్‌ ఒరియంటెడ్‌గా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ, యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.

ఫస్టాఫ్‌ రోటిన్‌ స్టోరీలా అనిపించింది. కానీ సెకండాఫ్‌ ట్విస్ట్స్‌, సస్పెన్స్‌తో ఆకట్టుకుంది. మెకానిక్‌ రాకీ ఓ వర్గం ఆడియన్స్‌ మెప్పించింది. కానీ కొందరి నుంచి డివైడ్‌ టాక్‌ అందుకుంది. దాంతో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌కు సొంతమైంది. దీంతో కొన్ని రోజులకే ఈ సినిమా థియేటర్‌ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ప్రకటన, సమాచారం లేకుండానే సైలెంట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ వచ్చేసింది. అమెజాన్‌ ప్రైంలో నిన్న రాత్రికి నుంచి మెకానిక్‌ రాకీ విడుదలైంది. థియేటర్‌లో ఈ మూవీ మిస్‌ అయిన వారు అమెజాన్‌ చూసి ఈ వీకెండ్‌ని ఎంజాయ్‌ చేయండి.

కథ విషయానికి వస్తే

రాకీ(విశ్వక్‌ సేన్‌) మెకానిక్‌ గ్యారేజ్‌ ఓనర్‌. మెకానిక్‌తో పాటు డ్రైవింగ్‌ స్కూల్‌ కూడా రన్‌ చేస్తాడు. ఇంజనీరింగ్‌ డిస్‌ కంటిన్యూ చేసిన రాకీ తన తండ్రి(నరేష్‌) గ్యారేజ్‌ని నడుపుతాడు. ఈ క్రమంలో డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్‌) రాకీ గ్యారేజ్‌కి వస్తుంది. వెంటనే డ్రైవింగ్‌ స్కూల్లో జాయిన్‌ అవుతుంది. ఆమె డ్రైవింగ్‌ నేర్పిస్తున్నక్రమంలో రాకీ తన గతం చెబుతాడు. తన లవ్‌స్టోరీ, తండ్రి మరణం గురించి చెబుతూ వారసత్వంగా వస్తున్న తన గ్యారేజ్ ఓ ల్యాండ్‌ లిటికేషన్‌లో ఇరుక్కుంటుందని ఆమెకు చెబుతాడు. ఇందుకోసం రూ. 50 లక్షల వరకు కట్టాలని లేదంటూ తన గ్యారేజ్‌ని కూల్చేస్తారని మాయతో చెప్పుకుని బాధపడుతుంటాడు. ఈ క్రమంలో తన తండ్రి పేరుపై రూ. 2 కోట్ల ఇన్సురెన్స్‌ ఉందంటూ మాయ నుంచి రాకీకి ఫోన్‌ వస్తుంది. అయితే అందులో తన పేరు తప్పుగా పడిందని షాకిస్తుంది. మరి తన ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం రాకీ ఏం చేశాడు? అసలు మాయ ఎవరూ? తెలియాలంటే మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

Exit mobile version