Site icon Prime9

Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసిన ‘తంగలాన్‌’ – ఎక్కడ చూడాలంటే

thangalaan ott streaming

Thangalaan OTT Streaming Details: చియాన్‌ విక్రమ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘తంగళాన్‌’. డైరెక్టర్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఆగష్టు 15న థియేటర్లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. అయితే కొద్ది రోజులుగా తంగలాన్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మూవీ ఓటీటీ రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తంగలాన్‌ ఓటీటీ రిలీజ్‌పూ క్లారిటీ లేదు. మూవీ ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కి నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో సడెన్‌ ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌ మూవీని రిలీజ్‌ చేసింది. సడెన్‌గా తంగలాన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండటంతో మూవీ లవర్స్ అంతా ఖుష్‌ అవుతున్నారు. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

తంగలాన్ ఓటీటీ ఆలస్యానికి కారణం

సాధారణంగా థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా ఓటీటీకి రావాల్సిందే. రిలీజ్‌కు ముందే ఓటీటీ సంస్థలు ఈ విషయమై మేకర్స్‌లో ఒప్పందం చేసుకుంటున్నారు. నెల, రెండు నెలల్లోనే ఓటీటీకి రావాల్సి తంగలాన్‌ రిలీజ్‌ కాకుండా మద్రాసు కోర్టులో ప్రజాప్రమోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమాలో కొన్ని మతాలను కించచారని, అందుకు మూవీ ఓటీటీలో రిలీజ్‌ కాకుండ ఆపేయాలంటూ పటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ పొంది థియేటర్‌లో విడుదలైన కారణంగా ఓటీటీ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెల్చేసింది. ఓటీటీ రిలీజ్‌ను ఆపడం కుదరదని తీర్పు ఇచ్చింది. ఈ సినిమాలో మళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు.

కథంటేంటే..

పీరియాడికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో తంగలాన్‌ను తెరకెక్కించారు. 1850లో బ్రిటిషర్ల పాలన కాలంలో జరిగే కథ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడిగా విక్రమ్‌ కనిపించాడు. అతని భార్య గంగమ్మ(పార్వతి తిరువొత్తు) నటించారు. వేపూర్‌ అనే గ్రామంలో తంగలాన్‌ తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తుంటాడు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో బంగారం వేతకడం కోసం క్లెమంట్‌ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్‌ వెళ్లాల్సి వస్తుంది. అలా బంగారు గనులు తవ్వుతున్న క్రమంలో వారిని వింత పరిణామాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి బంగారం కనిపెట్టారా? లేదా? అనేదది ఈ కథ. ఈ సినిమా సీక్వెల్‌ కూడా ఉంది.

Exit mobile version