Site icon Prime9

Ysrcp : ‘అకౌంట్‌ని కాపాడుకోలేని వెధవలు రాష్ట్రాన్ని కాపాడుతారా ?’ – వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై ట్రోలింగ్

opposition-parties-trolling-ysrcp-about-twitter-account-hack

opposition-parties-trolling-ysrcp-about-twitter-account-hack

Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. అదే విధంగా ప్రొఫైల్ పిక్, బయోడేటాను హ్యాకర్లు మార్చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.

మరోవైపు వైసీపీ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. హ్యాక్‌కు గురైన ట్విట్టర్ అకౌంట్‌ను రీకవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా హ్యాకర్లు ఇప్పటికే వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో విచిత్రమైన పోస్ట్ లను చేస్తున్నారు. ఎలాన్ మస్క్ , కోతులు, క్రిప్టో కరెన్సీ గురించి వరుసగా పోస్ట్ లు పెట్టారు. కాగా ఈ తరుణంలోనే ప్రతిపక్షాలన్నీ సోషల్ మీడియా వేదికగా వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలంతా ట్విట్టర్ వేదికగా వరుసగా సీఎం జగన్, వైకాపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వాటిలో కొన్నింటిని గమనిస్తే…

ఉన్న 3 అకౌంట్స్ ని సరిగ్గా మైంటైన్ చేసుకోవడం రాదు 3 రాజధానులు కడతారంట అని పోస్ట్ చేశారు.

అలానే మా అన్న అందరిని మోసం చేస్తాడు , మా అన్న @YSRCParty అకౌంట్ నే ఎవడో మోసం చేసాడు 😥😥😥 అంటూ షర్మిల దిగులుగా కూర్చున్న ఫోటోని పోస్ట్ చేశారు.

పేటీఏం బ్యాచ్ ఐదు రూపాయల కోసం క్లిక్ చేస్తే పిట్ట ఎగిరిపోయింది అంటూ రాసుకొచ్చారు.

బహుశా వైసీపీ అకౌంట్ ని పూజా హెగ్డే హ్యాక్ చేసిందేమో అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.

అకౌంట్ ని కాపాడుకోలేని వెధవలు రాష్ట్రాన్ని కాపాడతారా 🤣🤣🤣 సదరు నెటిజన్ తీవ్రంగా విమర్శించారు.

ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది. చూడాలి మరి వైకాపా నేతలు ఈ విషయం పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అని .

Exit mobile version