Site icon Prime9

Devara OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ చేసుకున్న ‘దేవర’ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

Devara Part 1 OTT Release Date Fix: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్‌ అందించింది నెట్‌ఫ్లిక్స్‌. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్‌ 1’ చిత్రాన్ని డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ చేస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత జూనియర్‌ నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపింది. థియేట్రికల్‌ రన్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 500 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

ఈ వారమే ఓటీటీకి… ఎక్కడంటే!

దేవర సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ ఢిల్‌కు దేవర ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ఈ వారం స్ట్రీమింగ్‌కి తీసుకురాబోతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఒప్పందం ప్రకారం రెండు నెలలకు ఓటీటీకి రావాల్సిన ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఆరు వారాల్లోని విడుదల చేస్తుండం విశేషం. అంటే శుక్రవారం నవంబర్‌ 8 నుంచి దేవర స్ట్రీమింగ్‌కి తీసుకురాబోతున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఇది తెలిసి ఓటీటీ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్లో దుమ్ముదులిపిన దేవర ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌ సరసన జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడి పాత్ర పోషించగా మరాఠి భామ శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌లు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version