NTR: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎప్రిల్ 8న ఘనంగా పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఈ హీరోలు చేసుకున్న చాట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్వీట్ వైరల్.. (NTR)
NTR and Allu Arjun Sarasalu😊
Nice 👍 pic.twitter.com/hnysgzdVip
— Telugu360 (@Telugu360) April 8, 2023
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎప్రిల్ 8న ఘనంగా పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఈ హీరోలు చేసుకున్న చాట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బావ అనే పదం ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ హీరోల మధ్య ఏం సంభాషణ జరిగిందో చూద్దాం.
అల్లు అర్జున్ తన 41వ పుట్టిన రోజును శనివారం ఘనంగా చేసుకున్నారు. ఈ మేరకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే క్రమంలో ఎన్టీఆర్ సైతం బన్నీకి విషెష్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే బావ.. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని తారక్ ట్వీట్ చేశాడు. దీనిపై బన్ని స్పందించాడు.
‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్.. అని రిప్లై ఇచ్చారు.
బన్నీ ఇచ్చిన రిప్లైకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఓన్లీ హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప? అంటూ అడిగాడు. దీనికి అల్లు అర్జున్.. “వస్తున్నా” అని కన్నుగీటారు.
ఇలా.. వీరిద్దరూ తమ క్రేజీ ప్రాజెక్ట్‌లోని స్పెషల్ డైలాగ్స్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలోని డైలాగ్ ని ఇక్కడ అల్లు అర్జున్ ఉపయోగించాడు)
ఇక, సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ కోసం వర్క్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకుడు.
తాజాగా విడుదలైన ఈసినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో పనిచేస్తున్నారు.