Site icon Prime9

Noida’s Twin Towers: కుప్పకూలిన ట్విన్ టవర్స్

twin towers prime9news

twin towers prime9news

Noida’s Twin Towers: నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు. ఈ భవనాలను కూల్చడానికి 3,700 కిలోల పేలుడు బాంబులను సిద్ధం చేసారు . దీంతో 9 సెకన్లలోపే భారీ పేలుళ్ళతో భవనాలన్నీ కూల్చి వేశారు . నేలమట్టం అయ్యాయి. దీనికోసం ప్రత్యేకంగా వాటర్ పాల్ అనే కొత్త పద్దతిని ఉపయోగించారు . ఒక్క బటన్ నొక్కగానే భవనాలన్నీ కుప్పకూలిపోయేల వీటిని ఏర్పాటు చేశారు. ఈ భవనాలను నిర్మించడానికి రూ.70 కోట్లు ఖర్చు పెట్ట్టారు . కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు.

భావనాన్ని కూల్చి వేసిన తరువాత దుమ్ము, కాలుష్య నివారణలను , నియంత్రించడానికి , ప్రత్యేక డస్ట్ మిషన్లలను కూడా ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన వెంటనే కొంత సమయంలోనే గాలిలో ఉండే దుమ్ము, దూళిని మిషన్ల ద్వారా క్లీన్ చేస్తారు . ఇంకో వైపు జంతు ప్రాణ నష్టం కలగకుండా , చుట్టూ పక్కల ఉండే వీధి కుక్కలకు కాపాడేందుకు ఎన్జీవో సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్జీవో సంస్థ వాళ్ళు కుక్కలన్నిటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు . మొత్తం 30 నుంచి 35 కుక్కలను కాపాడినట్టు ఎన్జీవో సంస్థ వాళ్ళు చెప్పారు.

తొమ్మిది ఏళ్ళు న్యాయ పోరాటం చేసిన ఫలితం దక్కలేదు . నిబంధనలకు వ్యతిరేకంగా ఈ భవనాన్ని నిర్మించారని ఈ ట్విన్ టవర్స్ భవనాలను వెంటనే కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది . ఐతే మళ్ళీ రూ. 20 కోట్లు పెడితే, భవనాలను కూల్చడానికి పని అయింది. సూపర్ టెక్ సంస్థ కుతుబ్ ఈ టవర్స్‌ను నిర్మించారు .

Exit mobile version