Site icon Prime9

Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. స్పష్టం చేసిన కేంద్రం

New Delhi: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు వెల్లడించారు. అయితే, జాతీయ ప్రాజెక్టు స్కీంలో చేర్చడానికి కాళేశ్వరానికి అర్హత లేదని స్పష్టం చేశారు.

2016, 2018లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

Exit mobile version